మార్కాపురం: రైతుల పెట్టుబడి తగ్గించి, అధిక దిగుబడులు సాధించి, వారి యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమం చేపట్టినట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నాయుడుపల్లి గ్రామంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమానికి నియోజకవర్గ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని తిరుమలరెడ్డి తిరుపతి రెడ్డి అనే రైతు యొక్క కంది పొలంను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా రైతులకు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా పంటలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి, చీడ పీడల గురించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆయన తెలిపారు. తదుపరి గ్రామ సచివాలయ ఆవరణలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతుల యొక్క ప్రగతికి కృషి చేయాలని సలహాలు ఇవ్వడం జరిగింది. అలానే ప్రతీ రైతు ఈ-పంట నమోదు చేపించుకోవాలని తెలియజేసారు. రైతులకు పెట్టుబడిని తగ్గించి అధిక దిగుబడులు సాధించే దిశగా పొలం పిలుస్తుంది కార్యక్రమం ఉండబోతుందని ఏ.ఓ దేవిరెడ్డి శ్రీనివాసులు తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో పంట నమోదు చేపించని వారు ఉంటే చెపంచుకోవాలని, ఈపంటలో నమోదు అయిన రైతులకు మాత్రమే వ్యవసాయ పధకాలు వర్తిస్తాయని, కావున ఇంకా ఎవరైనా పంట నమోదు చేపించుకొని వారు ఉంటే, వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి పంటలు నమోదు చేపించుకోగలరని సమావేశంలో ఆయన రైతులకు తెలిపారు. ఉద్యానవన శాఖ ఏ.పీ.యం.ఐ.పీ ద్వారా అందుతున్న వివిధ పండ్ల తోటలు, తుంపర సేద్య, నీటి బిందు (డ్రిప్) రాయితీ వివరాలను హెచ్.ఓ రమేష్ వివరించడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ద్వారా అందుతున్న పధకాలు మినీ గోకులం, పశు కిసాన్ క్రిడిక్ట్ కార్డు ద్వారా రుణాల గురించి, గలికుంటు టీకాల గురించి వీ.ఏ.యస్ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీ.డీ.పి అధ్యక్షులు రామంజుల రెడ్డి, నాయుడుపల్లి డీలర్ కందుల శ్రీనివాస రెడ్డి, నాయకులు వల్లపునేని చిన్న గాలెయ్య, తిరుమలరెడ్డి వెంకటరెడ్డి, వెంకటరాజు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామంలోని రైతులు పాల్గొనడం జరిగింది.